Saturday 25 November 2017

2019లో సీఎం ఎవరు....??part 3


    పవన్ కళ్యాణ్, తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం. నటుడిగానే గాక వ్యక్తిగతంగా కూడా ఆయనకి విపరీతమయిన ఫాలోఇంగ్ ఉంటుంది. ముఖ్యంగా యూత్ లో ఆయన క్రేజ్ టాలీవుడ్ లో ఏ ప్రముఖ హీరోలకి  ఉండదు అనేది అందరికీ తెలిసిందే. పవన్ తన సినీ ప్రయాణంలో ఒక దశాబ్దం విపరీత పరిస్థితులు ఎదుర్కున్నారు. పెద్దగా హిట్లు లేకపోవడం, చేసిన ప్రతి సినిమా ఏదీ కూడా అంచనాలకు చేరుకొకపోవడం ఇలా దశాబ్ద అనిశ్చితి ఎదుర్కున్నారు. అయితే, సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఫ్యాన్ బేస్ కొంచం తగ్గుతుంది. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా రోజు రోజుకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ పోతుంది.



    దశాబ్ద కాలం నిశబ్దానికి గబ్బర్ సింగ్ చిత్రం భారీ బ్రేక్ వేసింది. ఎన్నో అంచనాలతో విడుదలయిన ఈ చిత్రం అందిరనీ మెప్పించి బాక్స్ ఆఫీసు వద్ద సునామీ వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీ రికార్డు గా నమోదైంది. ఈ చిత్రం తరువాత మళ్లీ అత్తారింటికి దారేది మూవీ కూడ మరో రికార్డు సృష్టించి పవన్ కళ్యాణ్ ని హాట్ లోకి తీసుకొచ్చింది.

pavan kalyan photos, pavan kalyan pictures,pavan kalyan images

    ఇప్పటివరకు అంతా సాఫీగానే సాగింది అయితే ఊహించని రీతిలో పవన్ కళ్యాణ్ 14 మార్చ్ 2014 న చిరంజీవి మాదిరి ప్రజాసేవ కోసం అంటూ "జనసేనా" పార్టీ స్థాపించారు. ఎప్పటినుండో రాజకీయాల్లోకి రావాలి అన్న పవన్ ఫ్యాన్స్ కలలకి నిజరూపం దాల్చి రాజకీయరంగ ప్రవేశం చేశారు.
pavan kalyan janasena images, pavan kalyan janasena pictures, pavan kalyan janasena photos

    జనసేనా ఎన్నికల సంవత్సరం లో స్థాపించబడినప్పటీ ఆ సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యక్ష పోటీకి పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపించలేదు. కేంద్రం లో మోడీ తో జతకట్టిన తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించారు. చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాల ప్రతిపక్ష పాత్రకి తెరదించి అధికారంలోకి రావడానికి ఒక దోహదంగా పవన్ కళ్యాణ్ నీ ప్రస్తావిస్తారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటివరకు తటస్థ రాజకీయ ధోరణి అవలంబించిన పవన్ కళ్యాణ్ 2019లో పార్టీ తరపున అభ్యర్థులను పోటీలో నిలుపుతానని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికలకు మరో రెండు సంవ్సరాలు కూడా పూర్తిగా లేని నేపధ్యంలో జనసేన పార్టీ బలా బలాలు ఒకసారి నిశీత విశ్లేషణ ద్వారా చూద్దాం.

 

బలాలు :

 

1.విప్లవ స్వభావం :

    పవన్ కళ్యాణ్ లోని విప్లవ భావాలు, దేశభక్తి చాలా మందిని ఆయన ఆకర్షితులుగా మార్చాయి. అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్,చె గువెర  వంటి విప్లవ నేతల స్ఫూర్తి, మదర్ థెరిస్సా వంటి సేవ మూర్తుల అడుగుజాడలు ఆయనకి ఆదర్శం అంటుంటారు పవన్.
janasena pawan kalyan photos, janasena pawan kalyan images, janasena pawan kalyan pictures

    రాజకీయం ఎప్పుడు పరిస్తితులబట్టి మారుతుంది, అదెబాటలో నాయకులు కూడా మారుతున్నారు. దానికి పవన్ కళ్యాణ్ ఎంత వరకు విరుద్ధం అన్నది పూర్తి రాజకీయ ప్రవేశం చేశాక ఒక అవగాహన వస్తుంది.

2.అనధికార ప్రతిపక్షం :

    2014లో పార్టీ స్థాపించిన, మద్దతు మాత్రమే ఇచ్చి సరిపెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. అయితే అక్కడితో ఆగకుండా రాష్ట్రం లోని సమస్యలను కొన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, వాటి తక్షణ పరిష్కారాలకు ఆయన వంతు పోరాడుతున్నాడు. ఉద్దానం కిడ్నీ బాధిత సమస్యలు, అగ్రిగోల్డ్ సమస్య, రాజధాని భూ సేకరణ కు వ్యతిరేక పోరాటం చేస్తున్న రైతులకు మద్దతు, అగ్రికల్చర్ విద్యార్థులకు GO 64 రద్దు వంటివికి తన మద్దతు సాయం చేశారు. దీని ద్వారా రాజకీయాల్లో తనదైన పాత్ర పోషిస్తున్నారు పవన్ కళ్యాణ్.
pawan kalyan meeting  pictures, pawan kalyan meeting pics, pawan kalyan meeting images, pawan kalyan meeting photos

బలహీనతలు :

 

1.పూర్తిస్థాయి రాజకీయ స్థాపన :

    2019 ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్ది అధికార పార్టీ అయిన తెలుగుదేశం, ప్రతి పక్షాపార్టీ వైఎస్సార్సీపీ తమ తమ వ్యూహాలకు ఇప్పటినుండే పదునుపెడుతున్నయి. కానీ ఇప్పటివరకు జనసేనా పార్టీ బలోపేతానికి బలమయిన అడుగులు పడలేదు. కాకలు తీరిన రాజకీయ నాయకులు అభ్యర్థుల జాబితాల విషయంలో ఇప్పటి నుండే తలలు పట్టుకుంటున్నారు, కానీ జనసెనా ఈ విషయంలో పూర్తిగా వెనకబడింది అనే చెప్పాలి. ఇంకెప్పుడు అభ్యర్థులను ఖరారు చేస్తారు, వాళ్ళు ఎప్పుడు ప్రజల్లోకి వెళ్తారు అనేది వేచిచూడాలి. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషమేమిటంటే కొత్త అభ్యర్థుల కోసం పవన్ చూస్తున్నారు. పాత వారికే ఈరోజుల్లో గెలవడం కష్టం అయినసమయంలో కొత్తవారితో పార్టీ ఎంతవరకు నెట్టుకొస్తాది అన్నది చూడాలి.

2.ప్రశ్నించడం లో బలం లేకపోవడం :

     ప్రశ్నించడం కోసమే పార్టీ అన్న పవన్ ఆ విషయంలో ఒకడుగు ముందుకేస్తే రెండడుగులు వెనక్కి పడుతున్నాయి. కొన్ని వాటిపై మాత్రమే ఆయన స్పందిస్తున్నారు కొన్నివాటికి అసలు స్పందించలేదు. పుష్కరాల్లో 19మంది, కృష్ణ జిల్లా పడవ ప్రమాదంలో 29మంది చనిపోయినప్పుడు ఆయన స్పందించలేదు, అమలు కానీ హామీలను నెరవేర్చాలని టీడీపీనీ ప్రసించడం, కేంద్రం మెడలు వంచయిన "ప్రత్యేక హోదా" తెస్తామన్నారు ఆయన కానీ ఆ విషయం లో ఇప్పటికీ ఆయన మద్దతు ఇచ్చిన కేంద్రాన్ని గాని, చంద్రబాబు  సర్కార్ని గాని గట్టిగా అడగడంతో విఫలమయ్యారు.

pawan kalyan meeting speech photos, pawan kalyan meeting speech images, pawan kalyan meeting pictures
    
     మరి వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపున అభ్యర్థులను నిలబెట్టి వేరే పార్టీ కి మద్దతు ఇస్తారా లేక స్వతంత్రంగా పోటీ చేస్తారా, చేస్తే ఎన్ని స్థానాల్లో చేస్తారు అన్నది చూడాలి.


పార్ట్ 1కి టి.డి.పి పార్టీ మీద వివరణ ఇవ్వడం జరిగింది.  వెళ్ళడానికి ఈ లింక్ నొక్కండి:
http://fun-ten.blogspot.com/2017/11/Telugu-desam-balam-balaheenathalu.html

పార్ట్2లో వై.ఎస్.సి.పి పార్టీ మీద వివరణ ఇవ్వడం జరిగింది.  వెళ్ళడానికి ఈ లింక్ నొక్కండి:  
https://fun-ten.blogspot.com/2017/11/2019-cm-part2-ys-jagan-mohan-reddy.html 

No comments:

Post a Comment