Tuesday 21 November 2017

2019 సీఎం ఎవరు....?? Part 2

పార్ట్ 1 లో అధికార పార్టీ అయిన టీడీపీ గురించి విశ్లేషణ చూసాం ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీ గురించి మా చిన్న విశ్లేషణ.

వైఎస్సార్సీపీ :

             అనుకోని పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి  .తన తండ్రి అకాల మరణాన్ని జీర్ణించుకోలేక కొంతమంది ప్రాణాలు కోల్పోయారు.అప్పటివరకు వ్యాపార కార్యలకలాపలు చుస్కొనేవరు జగన్,క్రియాశీల రాజకీయాల్లో పెద్దగా పరిచయం లేని వ్యక్తి. అయితే తండ్రి మరణం తరువాత తన తండ్రి మరణంతో ప్రాణాలు కోల్పోయిన వారికోసం ఓదార్పు యాత్ర చేస్తనాని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షరాలు సోనియా గాంధీ కి విన్నవించగా ఆమె 'నో ' చెప్పడంతో కాంగ్రెస్ తో విభేదించి "వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ" స్థాపించారు. యువకుడు అయిన జగన్ సహజంగానే కొంచం ఆవేశంగా మొండిగా వ్యవహరిస్తారు.



ysrcp flag ysrcp images, ysr jagan mohan reddy

          2014 ఎలక్షన్స్ లో చంద్ర బాబుకి టీడీపీ పార్టీకి కంటిమీద కునుకులేకుండా చేశాడు జగన్. తండ్రి చనిపోయిన సానుభూతి జగన్ కి విపరీతంగా వేయడం, మహా మహా సీనియర్ నేతలు ఆయన వెంట నడవడంతో 2014 ఎలక్షన్స్ లో వైసీపీ విజయం నల్లేరు మీద నడక అనుకున్నారంతా. దీనికి తోడుగా సర్వేలు కూడా జగన్ ఏ కాబోయే ముఖ్యమంత్రి అని ఊదరగొట్టాయి. తీరా ఎలక్షన్స్ ఫలితాలు జగన్ కి తీవ్ర నిరాశనే మిగిల్చాయి. విజయం ముంగిట వరకు వచ్చి ఊరించి వెక్కిరించింది. 5లక్షల ఓట్ల తేడాతో చంద్రబాబు జగన్ పై జండ ఎగురవేశారు. 5 లక్షల మజోరిటి అంటే పెద్ద లెక్కకాదు జగన్ ఎంపీగా 5లక్షల మజోరిటీ తో గెలిచారు. కానీ ఓట్లు తక్కువ గెలిచినా సీట్లు ఎక్కువ గలవడం టీడీపీ అధికారానికి దోహద పడింది.

బలాలు :

1.జగన్ క్రౌడ్ పుల్లర్ :

               జగన్ కి ఉన్న ప్రజాదారణ మిగతా ఏ తెలుగు నాయకుడకి లేదు. ఆయన ప్రతిపక్ష

ysr jagan praja sankalpa yatra, yscrp crowd for praja sankalpa yatra picture
హోదాలో ఉన్నప్పటికీ ఆయన సభలకి అశేష జనవాహిని తరలోస్తుంది. ప్రాంతంతో సంబంధం లేకుండా జనాన్ని ఆకర్షించగల నాయకుడు జగన్.. 

2.పోరాట పటిమ :

 స్వతహాగా కొంచం ఆవేశం ఉన్న నాయకుడు జగన్. కానీ రాజకీయాల్లో ఆ మాత్రం ఆవేశం వుండాలి అప్పుడే ఏదైనా సమస్యపై గట్టిగా ప్రశ్నించి పొరాడగలం. ప్రత్యేక హోదా
ys jagan images, ysrcp party president images, ysrcp pictures. photos

ఇవ్వమని కేంద్రం తేల్చి చెప్పింది, అది ముగిసిన అధ్యాయం అని రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు గాలికి వదిలేసినా జగన్ దానిపై ఇంకా పోరాడుతున్నాడు. ప్రత్యేక హోదానే కాక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన 600 హామీల అమలు విషాన్ని కూడా జనాల్లోకి తీసుకుపోవడంలో సఫలం అయ్యారు.

3.పాదయాత్ర :

టీడీపీ తొమ్మిదేళ్ళ పాలనకు వ్యతిరేకంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి జనం తో మమేకమయ్యారు. జనంల నుండి తనవద్దకు వచ్చిన సమస్యల పరిష్కారాన్ని ఎన్నిక మానిఫెస్ట్ గా పెట్టి అధికారం చెప్పట్టరు. తరువాత చంద్రబాబు కూడా పాదయాత్ర చేసి అధికారం చేజిక్కించుకున్నారు.

ys jagan mohan reddy padayatra, ysrcp jagan pada yatra, ys jagan pada yatra

  పాదయాత్రలో ఇప్పుడు జగన్ వంతు అయింది. 3000వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి జనం సమస్యలు దగ్గరగా చూసి వాటినుండి 2019 మానిఫెస్ట్ తీయాలని ఆయన ఆలోచన. పాదయాత్రకు విశేష ఆదరణ లభిస్తోంది ఇది ప్రజలకి జగన్ మరింత చేరువ చేస్తుంది. తటస్తు ఓటర్లని తనవైపు ఆకరిషిన్చుకోవడనికి బాగా ఉపయోగపడుతుంది.

బలహీనతలు :

1.కోర్టు కేసులు :

జగన్ పై అనేక అక్రమాస్తుల కేసులు నమోదయ్యాయి. వాటి విచారణకు ప్రతి శుక్రవారం ఆయన కోర్టుకి హాజరవుతుంటారు. దీని అధికార పార్టీ బానే క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రతి విషయానికి జగన్ ను దోషిగా ప్రజల్లోకి తీసుకొని వెళ్లేందుకు సర్వశక్తులూ ఒడ్డుతునే వుంది. ఇవి అక్రమ కేసులా లేక అక్రమ ఆస్తుల అన్నవిషాని కోర్టే తేల్చాలి.

2.ఆవేశం :

సహజంగానే ఆవేశపరుడైన జగన్ అప్పుడప్పుడు హద్దులు దాటి కొన్ని మాటలు మాట్లాడతారు. ఉదాహరణ మొన్న నంద్యాల ఎలక్షన్స్ సమయంలో "ముఖ్యమంత్రినే నడిరోడ్డుపై కాల్చిన పర్లేదు" అనే పదజాలం సగటు ఓటరులోను వ్యతిరేక భావాని నింపింది. ఇలా కొన్నిసార్లు నిరుజారాడం చాలా పెద్ద పెద్ద దెబ్బలు కొని తీసుకొస్తుంది.

3.హామీలు :

ప్రజలకి ముఖ్యమంత్రి ఏ విధంగా హామీలు నెరవేర్చలేదని జగన్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారో ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కూడా అదే తలకు మించిన హామీలు గుప్పిస్తున్నారు. పెన్షన్ 2వెలకి పెంచడం, 45 ఏళ్ళకే ఎస్సీ, ఎస్టీ ,బీసీ కులాల వారికి పెన్షన్ ఇస్తనండం తలకు మించిన భారం. కొన్ని పడకాలు జనాలకు మేలు చేసేవే అయినా కొన్ని అవసరం లేనివి. ఉదహరణకు 45 ఏళ్ల వయసు అంటే ముసలితనం ఏమి కాదు సగటున 50 ఏళ్ల వరకు కష్టపడొచ్చు కానీ 45కే పెన్షన్ అనేది ఎంతవరకు సమంజసం..?? కొన్ని కుల వృత్తువల వరకు అది పరిమితం అయితే సరే కానీ అందరికీ ఇవ్వడం మాత్రం కాస్త ఆలోచించాలి.. రెండవది విద్యార్థులకు ఫీస్ రీయింబర్సుమెంట్. ఇక్కడి వరకు విద్యని ఇవ్వడంలో పర్లేదుగాని తిరిగి సంత్సరానికి 20 వేలు ఇవ్వడం సమంజసం కాదు అన్నది మా ఉద్దేశం. ఎందుకంటే ఈరోజుల్లో మరీ పిల్లలను అంతటి చదువులకు పంపేవారు కన్నేసం హాస్టల్ వసతి భరించలేనంత పేదరికం లో అయితే లేరు........

 ys jagan mohan reddy in assembly, jagan mohan reddy in assembly

వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే 2014లో తన ఓటు బ్యాంక్ కాపాడుకొని అధికార పార్టీ వ్యతిరేక ఓట్లను పవన్కళ్యాణ్ కి పోకుండా తనవైపు తిప్పుకునే చాలు. ఎందుకంటే ప్రతి ఓటు అదికారానికి ఎంతో కీలకం.

పార్ట్ 1కి వెళ్ళడానికి ఈ లింక్ నొక్కండి:  
http://fun-ten.blogspot.com/2017/11/Telugu-desam-balam-balaheenathalu.html
పార్ట్ 3 పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పై విశ్లేషణ 
https://fun-ten.blogspot.in/2017/11/pavan-kalyan-janasena-2019-part-3.html 

No comments:

Post a Comment