Monday 20 November 2017

2019 లో సీఎం ....???? Part 1

             రాష్ట్ర విభనతో తెలంగాణ, నవ్యాంధ్ర ప్రదేశ్ రెండుగా విడిపోయింది ఆంధ్ర ప్రదేశ్. విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో వైఎస్సార్సీపీ పార్టీ పై గెలిచి అధికారం కైవసం చేసుకుంది తెలుగుదేశం పార్టీ. కేంద్రం నుండి బీజేపీ,రాష్ట్రంలో జనసేన పార్టీలతో పొత్తు తెలుగుదేశానికి బానే కలిసొచ్చింది.



chandra babu naidu narendra modi pavan kalyan, chandra babu naidu, narendra modi, pavan kalyan
             రాయకియాలు ఎల్లకాలం ఒకేలా సాగవుగా. ఆంధ్ర ప్రదేశ్ లో రోజు రోజుకీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుండి ఆశించిన స్థాయిలో మనకు నిధులు రాకపోవడం, మిత్ర పక్షం అయిన బీజేపీ అప్పటిలో వున్న సఖ్యత ఇప్పుడు లేకపోవడం, ప్రత్యేక హోదా వంటి వాటిని రాబట్టుకోవడం లో రాష్ట్రం విఫలం కావడంతో పవన్ కల్యాణ్ కూడా తెలుగుదేశానికి పక్కలో బల్లెంలా తయ్యరనే చెప్పాలి. ఇప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీ కొమ్మకో పక్షీ ఆన్ని చందాన వున్నాయి. 2019లో ఎవరు ఎవరికి ఏసరు పెడతారు ఎవరికి చేయుతిస్తారు అన్నది ఆరోజు వరకు ఎవరికి అన్నది ఒక ప్రశ్న. ఇక ప్రస్తుతం ఒక్కొక్క పార్టీ బలాబలాలు ఎలా వున్నాయి అన్నది ఒక చిన్న విశ్లేషణ ద్వారా మీకందించే ఒక ప్రయత్నం.

తెలుగుదేశం :

             మొదటిగా అధికార పార్టీ అయిన తెలుగు దేశం పార్టీ తో మొదలుపెడితే, రాష్ట్రం విడిపోయి కష్టాల్లో ఉన్నప్పుడు ఒక అనుభవం కలిగిన వ్యక్తి, రాష్ట్రాన్ని ముందుకు తీస్కుపోగల సమర్థత ఉన్న వ్యక్తి అయితే బాగుంటుంది అని ఎక్కవ మంది ప్రజలు భావించారు, వీటికి సరిపడా వ్యక్తీ చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రిగా పలు దఫలూ పనిచేయడం ఆయనకి బాగా కలిసొచ్చింది. అప్పటికే వైఎస్సార్సీపీ మంచి ఊపులొ వుంది, సర్వేలు కూడా ఆ పార్టీకె
మోగ్గు చూపాయి. వీటన్నిటినీ దాటుకొని ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు చంద్రబాబు నాయుడు. అయితే రాను రాను ప్రజల్లో ఆయనమీద కొంచం వ్యతిరేక గాలలు వీస్తున్నయనే చెప్పాలి. అలాని ప్రభుత్వం మీద అవిశ్వాసం మాత్రం అంత త్వరగా బయట పడట్లేదు. ముందుగా ప్రభుత్వం యొక్క బలాలు చూద్దాం.

andhra pradhesh cm chandhra babu naidu picture

బలాలు:

1. రాజధాని భూసేకరణ:

             అమరావతి కోసం 33 వేల ఏకరలు భూమి సేకరించిన పెద్దగా రైతులు వ్యతిరేకించలేదు.దీనిలో ప్రభుత్వం బాగానే సఫలీకృతం అయిందని చెప్పాలి.అక్కడక్కడ  కొంతమంది వ్యతిరేకించిన వాటిని బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంది. దీన్ని పార్లిమెంట్ కూడా అభినంచింది.

2.నదుల అనుసంధానం:

             కృష్ణ, గోదావరి నదులు అనుసంధానం వల్ల వృధాగా సముద్రంలోకి పోయె గోదావరి నీరు కృష్ణ జిల్లా కి మళ్లించి అక్కడ కృష్ణ నీరు రాయలసీమ కి అందించి వ్యవసాయనికి చేయూత ఇచ్చారు.

andhra pradhes nadulu anusandhanam

పట్టిసీమ ద్వారా నీరు అందిస్తామని చెప్పి, ఆ ఇచ్చిన హామి అమలు చేసి రైతాంగానికి ఎంతో మేలుచేసారు. అయితే పట్టిసీమ పనులు వైఎస్ హయాంలోనే దాదాపు 65% పూర్తయ్యాయి.

3.MoU ల ఒప్పందం: 

             ఈ నాలుగేళ్ల పాలనలో ఎన్నో కంపెనీలు ఆంధ్ర ప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు చాలా స్వదేశీ, విదేశీ కంపెనీలు ఆసక్తి చూపి పెట్టుబడుల ఒప్పందం చేసుకున్నాయి. వాటిలో కొన్ని పనులు మొదలు పెట్టే దశలో ఉన్నాయి మరికొన్ని ఇంకా కాగితాలకే పరిమితం అయ్యాయి.

బలహీనతలు:

1.అమలు కానీ హామీలు:

             అధికారం వచ్చి 4 సంవత్సరాలు కావస్తున్నా ఇచ్చిన హామీలు పెద్దగా అమలు కాకపోవడం. ఎన్నికల సమయంలో దాదాపు 600 హామీలు ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కానీ అవి హామీలుగానే మిగిలిపోతున్నాయి. రైతు ఋణ మాఫీ , డ్వాక్రా మహిళలకు ఋణ మాఫీ వంటివి అధికారం టిడిపికి రావడానికి ప్రధాన హామీలు అనే చెప్పాలి. వీటిమీద ప్రజల్లో కొంచం నిరాశే మిగిలింది.

2. అమరావతి: 

             గొప్ప రాజధాని కోసం ఎప్పుడు పరితపించే చంద్రబాబు సునాయాసంగా 33000 ఏకరాలు భూమి సేకరిచారుగాని ఇప్పటివరకు శాశ్వత కట్టడం అనేది ఒక్కటి కూడా శంకుస్థాపనకు నోచుకోలేదు. మంచి డిజైన్స్ ఖరారు కోసం వేచిచూద్దాం అనే పేరుతో మరీ ఇన్ని సంత్సరాలు ఆగడం ఎంతవరకు సమంజసం అన్నది ఒక్కొక్కరిలో ఒక్కో భావన ఉంది.
budha statue in amaravathi picture

3.పోలవరం:

             పోలవరం ఏవత్ రాష్ట్ర ప్రజలకు ఒక అందని ద్రాక్షలానే మిగిలిపోతుంది. 2019 లోపు గ్రావిటీ ద్వారా నీరు అందిస్తామని చెప్తున్న అది ఒక కష్టసాధ్యం అయిన ప్రయాస. కేంద్ర సహకారం లేకపోవడం, టెండర్ పాడుక్కున Transtroy సకాలంలో పనులు పూర్తి చేయలేకపోవడం ఒక అడ్డంకి అయితే అమాంతం అంచనా పెంచెయ్యడం ఒక కారణం. చంద్రబాబు ఎంత కృషి చేస్తున్న కింద మంత్రులు నుండి సరైన ప్రోత్సాహం అందట్లేదు అన్నది వాస్తవం. వీటిని మిగిలిన ఒక సంవత్సర కాలంలో ఎంతవరకు పూర్తి చేసి ప్రజల్లో తన మీద ప్రజలు పెట్టిన నమ్మకాన్ని నిలపెట్టుకుంటారు అన్నదానిపైనే ఆయన వచ్చేసారి అధికారం ముడిపడి ఉంది.
polavaram project map pic.picutre

4. నిరుద్యగులుగా సమస్య:

             ప్రతి సంవత్సరం లక్షల్లో విద్యార్థులు  డిగ్రీ పట్టా పొంది కాలేజి నుండి బయటకొస్తున్నారు.కానీ వాస్తవ ప్రపంచంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా చిరుద్యోగులగానో మిగిలిపోతున్నారు. చచ్చిన వాడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు కొంతమంది వారు చదివిన కోర్స్ కాకుండా హోమ్ గౌర్డ్స్ గాను, ఆఫీస్ బాయ్స్ ఉద్యోగాలకు దరఖాస్తుల చేస్తున్నారంటే నిరుద్యోగ సమస్య ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

             "బాబొస్తే జాబొస్తుంది" అని ఊదరగొట్టిన తెలుగుదేశం ఏకంగ ఒక 'job calendar' విడుదల చేసింది కానీ ఇప్పటికీ వాటిని భర్తీ చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. దీనిపై సగటు విద్యార్థి ప్రభుత్వం మీద నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

5. ప్రతేక హోదా \ ప్రత్యేక ప్యాకేజ్:  

             5 సంవత్సరాలు.. కాదు కాదు 10 సంవత్సరాలు.... కుదరదు 15 సంవత్సరాలు.... ఇది ఎలక్షన్స్ ముందు వేలం పాటలా పెంచుకుంటూ పోయిన హోదా  సమయం. 5 అని మోడీ , 10 అని వెంకయ్య, కుదరదు 15 కావాలి అని చంద్రబాబు నాయుడు. కానీ ఏమయిందో ఏమో కానీ తరువాత కేంద్రం మాట మార్చి హోదా ఇక ఏ రాష్ట్రానికి ఇవ్వం అని చెప్పింది. వాళ్ళు తాన అంటే మనవాళ్ళు తందాన అంటూ "హోదా ముగిసిన అధ్యాయం" అన్నారు. హోదా స్థానం లో ప్రత్యేక ప్యాకేజ్ కి సరే  చెప్పారు చంద్రబాబు. అయితే ఆ ప్యాకేజ్ లో ఎంత ఇస్తారు అన్నది ఇప్పటికీ తెలీదు.

no special status for andhra pradhesh image
   
             హోదా కోసం ప్రధాన  ప్రతిపక్ష పార్టీ వైసీపీ మరియు జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకా పోరాడుతున్న విషయం తెలిసిందే. హోదా కన్నా ప్యాకేజీ ముద్దని సర్కార్ అంటుంది. అయితే హోదా 2018 తో అన్ని రాష్ట్రాలకు ముగున్స్తుంది అన్న కేంద్రం ఇంకో 10 సంవత్సరాలు వారం క్రితం పొడిగించింది. దీన్నిబట్టి చూస్తే ఆ హోదా దక్కించుకోవడంలో ఏపీ చాలా వెనకబదిందనే చెప్పాలి. కేంద్రాన్ని ఒత్తిడి చెయ్యడంలో బాబు సర్కార్ పూర్తిగా విఫలమయింది.

             అత్యంత నాటకీయ పరిణామాలు మద్యా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసింది కాంగ్రెసు పార్టీ. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అన్ని విధాలా నష్టపోయిన 'ఆంధ్ర ప్రదేశ్' కు 'ప్రత్యేక హోదా' కల్పించి ఆదుకుంటామని పార్లిమెంట్ సాక్షిగా వాగ్దానం చేశారు.
    అయితే ఇంత వ్యతిరేకత సగటు ఓటరు నుండి రావడంతో వాటిని రాజకీయ చానిక్యుడుగా అభివర్ణించుకుంటున్న చంద్ర బాబు నాయుడు ఏ విధంగా పార్టీని రాష్ట్రాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకుపోయి ఓట్లు రాబట్టుకుంటారో చూడాలి.

పార్ట్2లో వై.ఎస్.సి.పి పార్టీ మీద వివరణ ఇవ్వడం జరిగింది.  వెళ్ళడానికి ఈ లింక్ నొక్కండి: 
https://fun-ten.blogspot.com/2017/11/2019-cm-part2-ys-jagan-mohan-reddy.html 

1 comment: