Sunday 19 November 2017

మిస్ వరల్డ్ 2017 గా భారత ముద్దు గుమ్మ

              67వ మిస్ వరల్డ్ గా భారతీయ యువతి మానుషి చిల్లార్ ఎంపికయింది. నవంబర్ 18న జరిగిన ఫైనల్స్ లో ఆమె కిరీటాన్ని కేవసం చేసుకున్నారు. భారత దేశం నుండి మిస్ వరల్డ్ కిరీటం గెలిచిన 6వ మహిళా మానుషీ చిల్లార్. చైనాలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా 118 మంది ముద్దుగుమ్మలు పాల్గొన్నారు.
17 సంవత్సరాల క్రితం 2000వ సంవత్సరంలో ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ గా భారత దేశం నుండి గెలిచింది మళ్లీ ఇన్ని సంవత్సరాలకు మానుషి చిల్లార్ మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది.

Manushi Chhillar miss world 2017, miss world 2017 pictures
      
              హర్యానా కు చెందిన మానుషి చిల్లార్ మెడిసిన్ విద్యార్థిని. టాప్ 5లో ఇంగ్లాండ్, ఫ్రాన్స్, మెక్సికో, కెన్యా ముద్దు గుమ్మాలను వెనక్కి నెట్టి ఆమె ఈ కిరీటాన్ని దక్కించుకున్నారు. 'స్టీఫెని డెల్ వల్లే మిస్స్ వరల్డ్ 2016' మిస్స్ వరల్డ్ కిరీటన్ని విజేతగా నిలిచిన  మానుషి చిల్లార్ కు బహూకరించారు. రెండోవ స్ధానన్ని మెక్సికో భామ ఆండ్రియా మేజ, మూడవ స్థానన్ని ఇంగ్లాండ్ భామ స్టీఫెన్ హిల్ దక్కించుకున్నారు.

Manushi Chhillar is crowned by 2016 miss world Stephanie Del Valle in the event 2017 miss world event image
మిస్ వరల్డ్ 2017 ఈవెంట్ను చూడడానికి క్రింది లింక్ను క్లిక్ చేయండి :
https://www.youtube.com/watch?v=lq_TnBy7EWk 

              టాప్-5 రౌండ్ లో భాగంగా "ఏ వృత్తికి మీరు అధిక వేతనం ఇస్తారు" అని ప్రశ్న వేశారు. దానికి సమాధానంగా మానుషి చిల్లార్ ఈ విధంగా సమాధానం చెప్పింది "ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ గౌరవం పొందడానికి అర్హురాలు 'అమ్మ' ఇక జీతం విషయం అంటారా డబ్బుని ఎప్పుడు నగదుగానే చూడకూడదు అది మనం వేరే వాళ్ళకి మనం  ఇచ్చే ఒక ప్రేమ పూర్వకమైన కానుక, మర్యాదా. నా తల్లే నా జీవితానికి ఆదర్శం. ప్రతి తల్లి తన పిల్లకోసం ఎన్నో త్యాగం చేస్తుంది కాబట్టి తల్లికి ఈ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వేతనం ఇవ్వచ్చు" అని చెప్పి అక్కడున్న జడ్జీల హృదయాలు గెలిచి, ప్రేక్షకుల మన్నలను పొందింది.ఆమె సమాధానానికి అక్కడున్నవరంత చప్పట్లతో ఆమెని అభినందించారు.

మానుషి చిల్లార్ హెడ్ టు  హెడ్ ఛాలెంజ్ చూడడానికి క్రింది లింక్ను క్లిక్ చేయండి :
https://www.youtube.com/watch?v=m1PDqdLQMv8

మానుషి చిల్లార్ వ్యక్తిగత జీవితం:

              మానుషి చిల్లార్ హర్యానాలో జన్మించింది. ఈమె ఎం.బి.బి.ఏస్ చదువుతుంది. ఎప్పటికైనా పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు కృషి చేస్తుంది. అందరికీ వైద్యం అందలన్నదే ఆమె ఆశ. అదే కాకుండా ఆమె స్త్రీ హక్కుల కోసం కూడా ఎంతో కృషి చేస్తుంది. వెనుకబడిన అమ్మాయిలకు ఋతుస్రావంలో ఎదురయ్యే ఇబ్బందులని అదికమించడానికి ఆమె తన దగ్గరలో ఉన్న 20 పాఠశాలల విద్యార్థినలకు సానిటరీ ప్యాడ్ అందజేసి తన వంతు సాయం చేసేది.
              మానుషి చిల్లార్ మంచి నాట్య కళాకారిణి కూడా. ఆమె ఒక శిక్షణ పొందిన కూచిపూడి కళాకారిణి. దీనితోపాటు ఆమెకు పెరాగ్లైదింగ్, బంగీ జంపింగ్, స్నూర్క్లింగ్, స్కూబా డైవింగ్ , పెయింటింగ్ వంటి వాటిలో ప్రావీణ్యం సంపాదించారు. "మనల్ని మనం నమ్మితే ఎంతటి కస్తాన్నయిన జయించవచ్చు"  అన్నది ఆమె సిద్దాంతం.

భారత దేశం నుండి 'ప్రపంచ సుందరి' గా నిలించినవారిని ఒకసారి చూద్దాం

             1.  రైతా ఫరియా:

              రైతా ఫారియా 1966 లో మన దేశానికి మొదటి సారి ప్రపంచ సుందరి కిరీటాన్ని సాధించిన సుందరి. ఆసియా నుండి మొదటి సారి ప్రపంచ కిరీటం సాదిచింది కూడా రైతానే..డాక్టర్ గా కూడా ఆ కిరీటాన్ని సొంతం చేసుకున్న ప్రధమ సుందరి రైతా ఫరియా ..

              2. ఐశ్వర్య రాయ్:

              యావత్ దేశానికే పరిచయం అక్కర్లేని పొడుగు కాళ్ళ సుందరి. ఐశ్వర్య 1994 లో ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది.

              3. డయాన హైదెన్ :

              డయాన హైదెన్ 1997 లో మిస్స్ వరల్డ్ గా నిలిచింది.తర్వాతి కాలంలో ఆమె
  ' A BEAUTIFUL GUIDE' అనే పుస్తకం రాశారు.

              4. యుక్త మొంకే :

              యుక్త మొంకే 1999 లో  భారత్ నుండి ఈ ఘనత సాధించింది. ఈమె బీజేపీ పార్టీ ప్రస్తుత మెంబర్

              5. ప్రియాంక చోప్రా:

              ప్రియాంక చోప్రా నేటి బాలీవుడ్ భామ, హాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టిన ఈ సుందరి 2000 వ సంవ్సరానికి గాను మిస్స్ వరల్డ్ గా నిలిచింది.

              6. మానుషి చిల్లార్: 

              17 ఏళ్ళ తర్వాత మళ్లీ భారత దేశం తరఫున ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది.ఆ ఉద్వేగ భరిత క్షణం మీకోసం...

1 comment: