Showing posts with label political. Show all posts
Showing posts with label political. Show all posts

Saturday, 25 November 2017

2019లో సీఎం ఎవరు....??part 3


    పవన్ కళ్యాణ్, తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం. నటుడిగానే గాక వ్యక్తిగతంగా కూడా ఆయనకి విపరీతమయిన ఫాలోఇంగ్ ఉంటుంది. ముఖ్యంగా యూత్ లో ఆయన క్రేజ్ టాలీవుడ్ లో ఏ ప్రముఖ హీరోలకి  ఉండదు అనేది అందరికీ తెలిసిందే. పవన్ తన సినీ ప్రయాణంలో ఒక దశాబ్దం విపరీత పరిస్థితులు ఎదుర్కున్నారు. పెద్దగా హిట్లు లేకపోవడం, చేసిన ప్రతి సినిమా ఏదీ కూడా అంచనాలకు చేరుకొకపోవడం ఇలా దశాబ్ద అనిశ్చితి ఎదుర్కున్నారు. అయితే, సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఫ్యాన్ బేస్ కొంచం తగ్గుతుంది. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా రోజు రోజుకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ పోతుంది.

Tuesday, 21 November 2017

2019 సీఎం ఎవరు....?? Part 2

పార్ట్ 1 లో అధికార పార్టీ అయిన టీడీపీ గురించి విశ్లేషణ చూసాం ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీ గురించి మా చిన్న విశ్లేషణ.

వైఎస్సార్సీపీ :

             అనుకోని పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి  .తన తండ్రి అకాల మరణాన్ని జీర్ణించుకోలేక కొంతమంది ప్రాణాలు కోల్పోయారు.అప్పటివరకు వ్యాపార కార్యలకలాపలు చుస్కొనేవరు జగన్,క్రియాశీల రాజకీయాల్లో పెద్దగా పరిచయం లేని వ్యక్తి. అయితే తండ్రి మరణం తరువాత తన తండ్రి మరణంతో ప్రాణాలు కోల్పోయిన వారికోసం ఓదార్పు యాత్ర చేస్తనాని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షరాలు సోనియా గాంధీ కి విన్నవించగా ఆమె 'నో ' చెప్పడంతో కాంగ్రెస్ తో విభేదించి "వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ" స్థాపించారు. యువకుడు అయిన జగన్ సహజంగానే కొంచం ఆవేశంగా మొండిగా వ్యవహరిస్తారు.


Monday, 20 November 2017

2019 లో సీఎం ....???? Part 1

             రాష్ట్ర విభనతో తెలంగాణ, నవ్యాంధ్ర ప్రదేశ్ రెండుగా విడిపోయింది ఆంధ్ర ప్రదేశ్. విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో వైఎస్సార్సీపీ పార్టీ పై గెలిచి అధికారం కైవసం చేసుకుంది తెలుగుదేశం పార్టీ. కేంద్రం నుండి బీజేపీ,రాష్ట్రంలో జనసేన పార్టీలతో పొత్తు తెలుగుదేశానికి బానే కలిసొచ్చింది.